డయల్ యువర్ ఎస్‌ఈకి 8 ఫిర్యాదులు
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలో నిర్వహించిన డయల్ యువర్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయి. ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ సమస్యలను తెలుసుకున్నారు. పులిచెర్ల నుంచి పరిశ్రమ సర్వీసు పేరు మార్చాలని ఫిర్యాదు వచ్చింది. పుంగనూరు నుంచి చోరికాబడ్డ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలని ఇద్దరు ఫిర్యాదు చేశారు. నగరంలోని మురకంబట్టులో త్రీకటింగ్ చేయాలని, కార్వేటినగరంలో వ్యవసాయ సర్వీసులకు డబ్బులు కట్టామని, వాటిని రిలీజ్‌చేయాలన్నారు. కొత్తఇండ్ల నుంచి డబ్బులు కట్టినా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదన్నారు. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీలో లోఓల్టేజీ సమస్య నివారించాలన్నారు. పలమనేరు నుంచి వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలన్నారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈఈలను ఆదేశించారు. ఈఈ మునిచంద్ర, పీఓ రెడ్డెప్ప, డీఈ ఆనంద్, ఏఈ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.


