మా ఊరిలోనే పాఠశాల కొనసాగించాలి
మా ఊరిలోనే పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు చేతిలో ప్లకార్డులు పట్టి నిరసన చేపట్టారు. కలెక్టరేట్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. జిల్లాలోని గుడిపాల మండలం, వెంగమాంబపురం లో ఉన్న ఎంపీపీ పాఠశాలను ఏఎల్‌పురానికి మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు నవీన్, నాగజ్యోతి, మేఘల, ఏసుపాదం తెలిపారు. వెంగమాంబపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఏఎల్‌పురానికి పాఠశాలను మార్చే నేపథ్యంలో గత వారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు పెట్టడం లేదన్నారు. తమ గ్రామం నుంచి ఏఎల్‌పురం 3 కి.మీ దూరం ఉంటుందన్నారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


