400 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
– ముగ్గురు నిందితుల అరెస్ట్
వడమాలపేట (పుత్తూరు): శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం వడమాలపేట మండలం, ఎస్వీపురం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్‌ఐ హరీష్ కథనం మేరకు.. సోమ వారం తెల్ల వారు జామున టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి నుంచి తమిళనాడులోని ఊ తుకోటకు ఏపీ.21 టిజడ్.7850 నంబరు గల లారీలో రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు శ్రీకాళహస్తికి చెందిన మహాబూబ్ బాషా, నెల్లూరుకు చెందిన దసరథరామయ్య, ఊతుకోటకు చెందిన సంతోష్‌ను అరెస్ట్ చేశారు. లారీని తనిఖీ చేయాగా 50 కేజీలు కలిగిన 400 బస్తాల రేషన్ బియ్యా న్ని గుర్తించారు. ఈ బియ్యం విలువ రూ.9 లక్షలుగా లెక్కగట్టారు. తహసీల్దార్ జరీ నా పంచనామా నిర్వహించి, సీఎస్‌డీటీ హరికృష్ణ ద్వారా పుత్తూరు సివిల్ సప్‌లైస్ గోడౌన్‌కు తరలించారు. వడమాలపేట ఎస్‌ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


