సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా
చిత్తూరు అర్బన్ : అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల్లో మద్యం, గంజాయి స్మగ్లింగ్‌పై అధికారులు నిత్యం నిఘా కొనసాగించాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిభిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ అన్నారు. గురువారం గుడిపాల వద్ద ఉన్న నరహరిపేట ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఇక్కడ విధుల్లో ఉన్న సీఐ రవికుమార్, సిబ్బందితో కలిసి పలు వాహనాలను తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా చూడాలని, గంజాయి, నాటుసారా రవాణా ఎక్కడా కనిపించినా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇక రెక్టిఫైడ్ స్పిరిట్‌పై సైతం నిఘా ఉండాలన్నారు.


