పంటలు నీటిపాలు
వెనుక జలాలతో మునుగుతున్న పంటలు
కౌండిన్య బ్యాక్ వాటర్‌తో రైతుల గోస
ప్రాజెక్టు నిండిన ప్రతిసారి తప్పని ఇక్కట్లు
నష్టపరిహారం ఇచ్చేశామంటున్న
అధికారులు
ఎక్కడైనా ఓ ప్రాజెక్టు నిండితే దానికింద ఉండే ఆయకట్టు రైతులు సంబర పడిపోతారు. కానీ ప్రాజెక్టు నిండిన ప్రతిసారీ బ్యాక్ వాటర్‌తో పంటలు నీటిపాలవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. పలమనేరు మండలంలోని కాలువపల్లి కౌండిన్య జలాశయం వద్ద కొంత మంది అన్నదాతలు అవస్థలు ఇవీ. ఇటీవల కురిసిన వర్షాలకు ఇక్కడి రిజర్వాయర్ పూర్తిగా నిండి మొరవెత్తుతోంది. దీంతో బ్యాక్ వాటర్ కారణంగా కొంత అటవీ ప్రాంతం సైతం నీటమునిగింది. కొందరి రైతుల పంట పొలాల్లోకి నీరు చేరింది. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరిపంట నీట మునిగి మొదళ్లు కుళ్లి నీటిపాలైందని బాధిత రైతులు విలపిస్తున్నారు.
పలమనేరు: పలమనేరు పట్టణానికి దాహార్తిని తీర్చేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.55 కోట్లతో మండలంలోని కాలువపల్లి వద్ద కౌండిన్య నదిపై రిజర్వాయర్‌ను నిర్మించింది. దీన్ని ఆపై కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ప్రారంభించారు. ఏటా వర్షాలకు నీరు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి పైప్‌లైను ద్వారా పట్టణానికి నీటి సరఫరా చేస్తున్నారు. ఈ జలాశయం సామర్థ్యం 50 ఎంసీఎఫ్‌టీగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో రైతుల నుంచి 30 ఎకరాల భూములను భూసేకణ చేపట్టి వారికి నష్ట పరిహారాన్ని అందజేశారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టు నిండి మొరవవెత్తుతున్నందున బ్యాక్‌వాటర్ నదికి వెనుక నున్న ఏరియా (ఫోర్‌సోర్) మరో 20 ఎకరాల్లో నీరు చేరింది. ఇదిగాక 20 ఎకరాలకు పైగా అడవి సైతం బ్యాక్ వాటర్‌తో నిండిపోయింది. నది బ్యాక్ వాటర్‌తో నీట మునిగిన రైతులకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
కుళ్లిపోతున్న వరి
బ్యాక్ వాటర్ కారణంగా కాలువపల్లికి చెందిన పలువురు రైతులకు చెందిన పదెకరాలకు పైగా వరి పొలాలు ఎన్ను, కోత దశలో ఉన్నాయి. ఇదంతా నీటి మునగడంతో పంట పాచిపోవడం గ్యారెంటీ. ఎకరా వరిమడి నాటేందుకు రూ. 30 వేల దాకా ఖర్చు చేశామని పంట నీటిపాలైందని వాపోతున్నారు. ఈ విడత జీవనాధారం కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. లకు ప్రభుత్వం పంటనష్టాన్ని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కౌండిన్య జలాశయం వెనుక జలాలతో మునిగిన వరిపంట
మొరవపోతున్న కౌండిన్య జలాశయం
పంటలు నీటిపాలు


