జైళ్లశాఖ డీజీపీని కలిసిన జిల్లా ఎస్పీ
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర జైళ్లశాఖ డీజీపీ అంజనీకుమార్‌ను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం చిత్తూరుకు వచ్చిన ఆయన.. స్థానిక పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. అంజనీకుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసిన డూడీ.. పలు విషయాలపై చర్చించారు. ఏఎస్పీ రాజశేఖర్‌బాబు సైతం డీజీపీను కలిశారు.
చిత్తూరు జైలు సందర్శన
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరం గిరింపేటలో ఉన్న జిల్లా జైలును ఆ శాఖ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ గురువారం సందర్శించారు. చిత్తూరుకు వచ్చిన జైళ్లశాఖ డీజీపీ.. జైలును పరిశీలించి, ఇక్కడ ఖైదీలకు అందుతున్న వస తులు, భద్రతాపరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. ఖైదీల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని జిల్లా జైలు అధికారి వెంకటరెడ్డిని ఆదేశించారు.


