● దీపం.. దివ్యతేజం
తిరుపతిలో టీటీడీ పరిపాలన భవన మైదానంలో శుక్రవారం రాత్రి శోభాయమానంగా కార్తీక దీపోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై సామూహికంగా దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీరాఘవేంద్ర వేదస్వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యం వివరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారికి, చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన జరిపించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. భక్తులతో దీప మంత్రం పలికిస్తూ లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ క్రమలో కళాకారులు ప్రదర్శించిన లక్ష్మీ ఆవిర్భావం నృత్య రూపకం ఆకట్టుకుంది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పఠిస్తుండగా నక్షత్ర హారతి, కుంభ హారతి నిర్వర్తించారు.
– తిరుపతి అన్నమయ్యసర్కిల్
● దీపం.. దివ్యతేజం


