‘‘ చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. వైఎ
టీటీడీ మాజీ ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ది ప్రభుత్వ హత్యే..! చంద్రబాబు అరాచకాలకు ఇంకెందరు బలి కావాలి..? రాజకీయ కక్షతో పరకామణి కేసును భూమనకు ఆపాదించేందుకు కుట్ర సర్కారు తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం
తిరుపతి మంగళం : తిరుమల పరకామణి కేసులో సిట్ అధికారుల వేధింపులు తట్టుకోలేకే మాజీ ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలు వేధింపులు తప్ప ప్రజాపాలన ఎక్కడ సాగుతోందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బలహీన పరిచేందుకు ఆయన చుట్టూ ఉన్నవారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు తీరును ఎవరి ప్రశ్నించినా ఏదోరకంగా అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే టీటీడీలో పెరిగిన అవినీతి అక్రమాలు, అపచారాలపై నిత్యం ప్రశ్నిస్తున్న భూమన కరుణాకరరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపేందుకు చంద్రబాబు, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి కేసులో ఎలాగైనా భూమన కరుణాకరెడ్డిని ఇరికించేందుకు మాజీ ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ను వేధించడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. సిట్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సతీష్‌కుమార్‌తో పాటు ఇంకెంతమందిని బలితీసుకుంటారంటూ మండిపడుతున్నారు.


