కూలికి వెళుతూ కానరాని లోకాలకు..
– 10లో
న్యూస్‌రీల్
ఇప్పటివరకు వందలాది ఎర్రచందనం దుంగల స్వాధీనం ఒక్క నిందితుడూ దొరకని వైనం పలమనేరు మీదుగా కర్ణాటకకు సాగుతున్న స్మగ్లింగ్ తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్న అటవీశాఖాధికారులు
కూలీ పనులకు వెళ్తుండగా ఓ మహిళను మృత్యువు కబళించింది.
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఎర్రచందనం.. ప్రకృతి ప్రసాదితం.. అరుదైన వృక్షం.. ఈ చెట్టుకు శేషాచలం నిలయం.. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రస్తుతం పలమనేరు హైవే రాజమార్గం.. ఈ ప్రాంతం మూడు రాష్ట్రాల కూడలి కావడం.. శేషాచలం నుంచి దుంగలు తరలించే వాహనాలు కౌండిన్య అడవుల మీదుగా తమిళనాడు, కర్ణాటకకు సులువుగా తరలివేళ్లేందుకు అవకాశం. ఫలితం నిత్యం ఈ మార్గంలో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా.. అయితే పలమనేరు అటవీశాఖాధికారులు ఈ మార్గంలో తరలే ఎర్రచందనం దుంగలను మాత్రమే పట్టుకుంటున్నారు. మరి దొంగలు ఏమవుతున్నారన్న అంశం శేష ప్రశ్నగా మిగులుతోంది.
దుంగలేనా..
ఎర్రదొంగలేరీ?
పలమనేరు: కొన్నాళ్లుగా పలమనేరు నియోజవర్గంలో ఎర్రచందనం అక్రమరవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. శేషాచలం అడవుల నుంచి రకరకాల మార్గాల ద్వారా పలు వాహనాల్లో పలమనేరు మీదుగానే పొరుగునే ఉన్న కర్నాటక, తమిళనాడు చేరుతోంది. కానీ ఈ ప్రాంతంలో ఎర్రచందనం వాహనాలు వెళుతున్న విషయం ఇక్కడి అటవీశాఖాధికారులకు మాత్రం తెలియదు. బయట నుంచి వచ్చే ఫారెస్ట్ అధికారులో లేదా ఫ్లయింగ్‌స్క్వాడ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ నుంచి పలమనేరు ప్రాంతంలో దుంగల వాహనం వెళతుందనే సమాచారం వస్తే అప్పుడు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు వారిని పట్టుకునేలోపే స్మగర్లు వెళ్లిపోతుంటారు. ఆపై ఇక్కడి నుంచి పలు మార్గాల్లో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో వాహనాలను వదిలి నిందితులు తప్పించుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్థానిక ఫారెస్ట్ అధికారులు దుంగలను వాహనాలను పట్టుకుంటున్నా ఓ నిందుతుడినైనా పట్టుకున్నా రా? అనే మాట స్థానికుల నుంచి వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన ఘటనలివీ..
రెండు నెలల కిందట బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట వద్ద పొలాల్లోని ఓ ఇంట్లో 144 ఎర్రచందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సాయం తీసుకోకుండా పట్టుకుని సంచలనం సృష్టించారు. పదిమందికి పైగా ఉన్న ఫారెస్ట్ సిబ్బంది కళ్లుగప్పి అక్కడే ఉన్న ప్రధాన స్మగర్ల్ తన స్నేహతురాలితో కలిసి కారులో ఉడాయించాడు. ఇప్పటిదాకా నిందితున్ని పట్టుకున్న పాపాన పోలేదు. దీనిపై పోలీసులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఫారెస్ట్‌శాఖే ఈ కేసును ఛేజ్ చేయనీ అని వదిలేసినట్టు సమాచారం.
ఇదే మండలంలోని నెల్లిపట్ల అడవిలో తమిళనాడు సరిహద్దులోని అరట్ల అటవీ మార్గంలో కొన్ని ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు గతనెలలో పట్టుకున్నారు. కానీ దుంగలు మాత్రం దొరికాయి. వీటిని తరలిస్తున్న స్మగర్లు మాత్రం అడవిలోకి పారిపోయారని అధికారులు చెప్పారు.
అదే మండలం నెల్లిపట్ల ప్రాంతంలో ఆరునెలల క్రితం శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలున్న కారు పలుచోట్ల అధికారులను తప్పించుకుని నెల్లిపట్ల మార్గంలోకి వచ్చింది. అక్కడి నుంచి పూర్తిగా అడవి కావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో కారులోని వ్యక్తులు కారును వదలిపెట్టి అడవిలోకి పారిపోయారు. ఆపై దుంగలున్న కారును పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు రెండ్రోజుల పాటు నెల్లిపట్ల, చింతలగుంట అడవుల్లో గాలించి ఎవరి ఆచూకీ లేదని మిన్నకుండిపోయారు.
గతంలో ఓ దుంగలున్న ఖరీదైన కారు పలమనేరు మీదుగా వస్తోందనే సమాచారంలో స్థానిక అటవీశాఖ పట్టణ సమీపంలోని బైపాస్ వద్ద మాటు వేసింది. వారిముందే ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. ఆ కారును వెంబడించలేని ఫారెస్ట్ వాహనం చేసేది లేక హైవేలోని టోల్‌గేట్ వారికి సమాచారాన్ని అందించారు. దీన్ని ముందుగానే పసిగట్టిన స్మగ్లర్ పలమనేరు బైపాస్‌లోని ఓ పొలం వద్ద కారును ఆపి సమీపంలోని ఓ దాబాలో మద్యం సేవించి, భోజనం చేసి ఆపై రాత్రయ్యాక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇదే హైవేలో కర్ణాటకకు వెళ్లిపోయాడు.
తాజాగా పులిచెర్ల నుంచి దుంగలతో వచ్చిన కారు పలమనేరు మీదుగా వస్తోందని స్థానిక ఫారెస్ట్ అధికారులకు ముందుగానే సమాచారం అందింది. కానీ పట్టణానికి సమీపంలో కాపుగాచిన వీరు ఆ కారును పట్టుకోలేకపోయారు. దీంతో స్మగర్లు అడ్డదారుల్లో వెళుతుండగా చివరకు అప్పినపల్లి గ్రామస్తులు పట్టుకోవాల్సి వచ్చింది.
తప్పించుకోనేందుకు అడవులే దిక్కు...
పలమనేరు ప్రాంతం రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. దీంతో హైవే నుంచి పలు గ్రామీణ మార్గాల మీదుగా బైరెడ్డిపల్లి మండలంలో ప్రవేశించి కర్ణాటకలోకి సులభంగా దుంగలను తరలించవచ్చు. అలాగే ఇదే మండలంలోని నెల్లిపట్ల నుంచి అడవిలో తమిళనాడుకు వెళ్లే మార్గాలున్నాయి. ఇటు కర్ణాటక గ్రామాలకు అడ్దదారుల ద్వారా సులభంగా వెళ్లవచ్చు. ఓ వేళ ఎవరైనా వాహనాలను పట్టుకోవాలని వస్తే వాటిని వదిలి రోడ్డు పక్కనే ఉన్న అడవుల్లోకి వెళితే చాలు. వీరు ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాల్లోని బోర్డర్ గ్రామాల్లోకి సులభంగా చేరుకోవచ్చు. అందుకే ఈ సరిహద్దులను స్మగ్లర్లకు ఎంచుకుంటున్నట్టు సమాచారం.
కూలికి వెళుతూ కానరాని లోకాలకు..


