● కారు ఢీకొని మహిళ మృతి ● మరొకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

● కారు ఢీకొని మహిళ మృతి ● మరొకరికి గాయాలు

Nov 15 2025 7:19 AM | Updated on Nov 15 2025 7:21 AM

● కారు ఢీకొని మహిళ మృతి ● మరొకరికి గాయాలు

శాస్త్రోక్తంగా

రాహుకాల అభిషేక పూజలు

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహు కాల అభిషేక పూ జలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాహుకాల సమ యం 10.30 నుంచి 12 గంటల వరకు సంప్రదా య పద్ధతిలో అర్చనలు, అభిషేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మ వారిని ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభ యకర్తలకు తీర్థప్రసాదాలు, భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

నిందితుడి అరెస్టు

యాదమరి: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడిని అరె స్టు చేసినట్లు ఎస్‌ఐ ఈశ్వర్‌ చెప్పారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండ లంలోని పాచిగుంట గ్రా మానికి చెందిన ఓ వివాహిత గత ఏడాది డిసెంబర్‌ 11వ తేదీ గ్రామ శివారులోని ఓ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అదే గ్రామానికి చెందిన వసంత్‌కుమార్‌ అనే వ్యక్తి సదరు మహిళను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసు కుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి నిందితుడు పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు వసంత్‌కుమార్‌ ఓటేరుపల్లి క్రాస్‌ వద్ద తిరుగుతుండగా అతనిని అరెస్టు చేసిచ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపారు.

కూలికి వెళుతూ

కానరాని లోకాలకు..

గంగాధర నెల్లూరు : కూలి పనులకు వెళుతూ మరో కొద్ది దూరంలో పని చేసే ప్రాంతానికి చేరుకుంటామనుకునే లోపు అతివేగంగా వచ్చి న కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిగా, మరో వ్యక్తి గాయాల పాలైన సంఘటన శుక్రవారం జీడీ నెల్లూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలంలోని పెద్దకాలువ పంచాయతీ ఎన్టీఆర్‌ కాలనీ వద్ద తమిళనాడు రాష్ట్రం కుండలూరు గ్రామానికి చెందిన మీరమ్మ, రఘు ద్విచక్ర వాహనంలో చిత్తూరు వైపునకు కూలి పనికి బయలుదేరారు. చిత్తూరు వైపు నుంచి గంగాధర నెల్లూరు మండలంలోని మోటూరు వద్ద ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి ఓ ఇన్నోవా కారులో కొందరు అతివేగంగా వస్తూ ఎన్టీఆర్‌ కాలనీ వద్ద పుత్తూరు చిత్తూరు జాతీయ రహదారి నుంచి డివైడర్‌పై దూసుకు వెళుతూ ఎదురుగా చిత్తూరు వైపునకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మీరమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందాగా, రఘు తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడీ నెల్లూరు పోలీసులు తెలిపారు.

● కారు ఢీకొని మహిళ మృతి ● మరొకరికి గాయాలు 1
1/1

● కారు ఢీకొని మహిళ మృతి ● మరొకరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement