నేడు ఐసర్‌లో సదస్సు
– 8లో
తిరుపతి ఐసర్‌లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 91వ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రెసిడెంట్ తెలిపారు.
డీఎస్సీ ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా టెట్, డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు కుట్టి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పవనకుమారి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా లోని ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెట్ ఉచిత కోచింగ్‌తో పాటు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పరీక్షలు, స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెండు సెట్ల విద్యార్హత సర్టిఫికెట్‌లు, నాలుగు ఫొటో లు తీసుకుని చిత్తూరులోని మిట్టూరు, పలమనేరులో ఉండే శిక్షణా కేంద్రాల్లో సంప్రదించవచ్చని కోరారు. ఈ అవకాశం ఈనెల 15వ తేదీతో ముగుస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9491844963 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
16న కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీఅమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా ఆదివారం అంకురార్పణ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. సా యంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
17న ధ్వజారోహణం
పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబరు 17వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభానికి తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధ్వజారోహణంతో అమ్మ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని తెలిపారు.


