గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం
వడమాలపేట (పుత్తూరు): మండలంలోని తడుకు ఆర్‌ఎస్ వద్ద పాదచారులపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి పుత్తూరు వైపుగా వెళుతున్న వాహనం పాదచారులను ఢీకొని వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే విజయపురం మండలం కేవీ పురం గ్రామానికి చెందిన రంజిత్‌నాయుడు(52) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు వడమాలపేట మండలం ఎస్బీఆర్‌పురం గ్రామానికి చెందిన బాబురాజు అలియాస్ నరసింహరాజన్న(54)కు పుత్తూరు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం


