ఫైరింగ్‌లో మెళకువలు నేర్చుకోండి
గంగాధర నెల్లూరు : ఫైరింగ్‌లో మెళకువలు నేర్చుకుని, అనుమానాలు లేకుండా లక్ష్యంపై గురి పెట్టాలని అడిషనల్ ఎస్పీ ఎస్‌ఆర్ రాజశేఖర్ రాజు అన్నారు. గంగాధర నెల్లూరు మండలంలో ముష్టిపల్లి వద్ద ఐదు రోజులుగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు మేరకు పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చివరి రోజైన బుధవారం చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులు నిరంతరం శ్రమిస్తుంటారన్నారు. ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మెళకువలు నేర్చుకుని, ఫైరింగ్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి బుల్లెట్ లక్ష్యం వైపు దూసుకుపోయేలా శిక్షణ పొందాలని సూచించారు. అనంతరం అందరితో కలిసి ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్‌ఐ అడ్మిన్ సుధాకర్ పాల్గొన్నారు.


