డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

Nov 14 2025 6:25 AM | Updated on Nov 14 2025 6:25 AM

డివైడ

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

గుడిపాల : సీఎంసీ ఆసుపత్రి వద్ద ఆసుపత్రి ఎంట్రీ వద్ద ఉన్న డివైడర్‌ను కంటైనర్‌ లారీ ఢీకొంది. బెంగుళూరు నుంచి చైన్నెకి సబ్బుల కంటైనర్‌ లారీ వస్తూ శుక్రవారం తెల్లవారుజామున సీఎంసీ ఆసుపత్రి వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైవే అధికారులు డివైడర్‌ వద్ద లైట్లు వేయకపోవడంతో రాత్రి వేళల్లో డ్రైవర్లకు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా డీఆర్‌వో

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా డీఆర్‌వో మోహ న్‌ కుమార్‌ ను ఆ సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ అధికారులు జిల్లా ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ సభ్యుల వివరాలను గురువారం వెల్లడించారు.సెక్రటరీగా వెంకటరమణ (సమగ్రశిక్ష శాఖ, ఏపీసీ), ట్రెజరర్‌గా ఎస్‌.లక్ష్మి (జిల్లా కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌), గౌరవ అధ్యక్షులుగా మురళికృష్ణ (జిల్లా వ్యవ శాఖ అధికారి),అసోసియేట్‌ అధ్యక్షులుగా మధుసూదన్‌రెడ్డి (హార్టికల్చర్‌,డీడీ), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శ్రీనివాసరావ్‌ (సీపీవో)ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాఽ ద్యక్షులుగా రవికుమార్‌ నాయుడు (జెడ్పీ,సీఈవో), రవికుమార్‌ (డ్వామా, పీడీ), శంకరన్‌(డీఎస్‌వో), రామచంద్రయ్య(ట్రెజరీ,డీడీ), సుధాకర్‌రావ్‌ (డీపీవో)ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. మహిళా విభాగం జాయింట్‌ సెక్రటరీగా శ్రీదేవి (డీఆర్‌డీఏ, పీడీ), జాయింట్‌ సెక్రటరీలుగా రాఘవులు(సైనిక సంక్షేమ శాఖ అధికారి), ఇస్మాయిల్‌ అహ్మద్‌ (ట్రాన్స్‌కో ఎస్‌ఈ), చంద్రశేఖర్‌రెడ్డి (పీఆర్‌,ఎస్‌ఈ), సంధ్యారాణి (డీఎంఅండ్‌హెచ్‌వో)ను ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్‌లుగా రాజశేఖర్‌ (అడిషనల్‌ ఎస్పీ), గుణశేఖర్‌రెడ్డి (జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి), పద్మజ (డీసీవో), రవికుమార్‌ (డీఎల్‌డీవో) తదితరులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తత ముఖ్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : టెక్నాలజీ పరంగా పలుచోట్ల జరుగుతున్న సైబర్‌ నేరాలపై విద్యార్థుల్లో అప్రమత్తత ముఖ్యమని అడిషనల్‌ ఎస్పీ రాజశేఖర్‌రాజు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని తెలిపారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలన్నారు. తెలియని లింక్‌లను, అనుమానాస్పద సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. విద్యార్థినుల భద్రతకు రూపొందించిన శక్తి మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అత్యవసర సమయాల్లో వినియోగించాలన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటీవల కొంతమంది పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్స్‌, ఫోన్‌లో ప్రజలను బెదిరిస్తున్నారని, వాటిని నమ్మి మోసపోకూడదన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ మహేశ్వర, ప్రిన్సిపల్‌ మనోహర్‌, క్రైమ్‌ స్టేషన్‌ ఎస్‌ఐ హరినాయక్‌, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళా విభాగం జాయింట్‌ సెక్రటరీగా డీఆర్‌డీఏ పీడీ

సెక్రటరీగా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ

జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా డీఆర్‌వో

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌1
1/3

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌2
2/3

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌3
3/3

డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement