పోలీసుల అదుపులో డ్రైవర్
వడమాలపేట (పుత్తూరు) : తడుకు ఆర్‌ఎస్ వద్ద బుధవారం రాత్రి పాదచారులపై దూసుకెళ్లి ఇద్దరి మృతికి కారణమైన లారీని తిరుత్తణి వద్ద గుర్తించినట్లు ఎస్‌ఐ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. కర్నూలు నుంచి తిరుత్తణికి సిమెంట్ లోడ్ తీసుకెళ్లే క్రమంలో అంజేరమ్మ గుట్ట నుంచి కిందికి దిగే క్రమంలో అదుపు తప్పి లారీ సైడ్‌కు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదం జరిగిన చోటే లారీని ఆపకుండా తిరుత్తణికి వెళ్లిన డ్రైవర్ మారిముత్తు(52)ను అక్కడ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ప్రమాదంలో విజయపురం మండలం కేవీపురం గ్రామానికి చెందిన రంజిత్‌నాయుడు(52), వడమాలపేట మండలం ఎస్బీఆర్‌పురం గ్రామానికి చెందిన బాబురాజు అలియాస్ నరసింహారాజు(54) మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించామన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ఐరాల : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చెందిన సంఘటన మండలంలోని పొలకలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పొలకల బీసీ కాలనీకి చెందిన కె.గిరిబాబు(29) బంగారుపాళెంలో ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన ద్విచక్ర వాహనంలో విధులకు వెళ్లాడు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి వస్తుండగా పొలకల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో గిరిబాబు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దీప, కుమారుడు, 8 నెలల కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో డ్రైవర్


