
మహిళలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
– మహిళలపై గౌరవం లేని పార్టీ టీడీపీ
శ్రీరంగరాజపురం : మహిళలు అంటే గౌరవంలేని పార్టీ టీడీపీ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని ముద్దుకుప్పంలోని విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దళిత మహిళ అయిన తనను అవమానకరమైన రీతిలో సభ్య సమాజం తలదించుకొనేలా ఏక వచనంతో అసభ్యకర పదజాలంతో మాట్లాడటం దారుణమన్నారు. ఈ సృష్టికు మూలం మహిళ అలాంటి వారి గురించి పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడటం మహిళలందరినీ అవమానించినట్టేనని అన్నారు. తన చీరల గురించే మాట్లాడం కంటే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై మాట్లాడాలని, వాటిని పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సహకరిస్తాం, అంతేకానీ మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అవమానిస్తూ మాట్లాడటాన్ని జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మహిళ లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.
ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం
తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్‌లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.