
బీర్జేపల్లెలో పిడుగు పాటు
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ, బీర్జేపల్లెలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు రెండు ఇళ్లపై పిడుగులు పడ్డాయి. దీంతో రూ.1.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ఒక్కసారిగా మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. బీర్జేపల్లె గ్రామానికి చెందిన ఎస్.చంద్ర ఇంటి ముందుగల టెంకాయ చెట్టు తోపాటు నూతనంగా నిర్మించిన ఇంటిపై పిడుగుపడింది. చంద్ర ఇంట్లో విద్యుత్ వైర్లు అన్నీ కాలిపోయాయి. అలాగే పక్కనే ఉన్న శీనప్పకు చెందిన ఇంట్లో కూడా విద్యుత్ సామగ్రి కాలిపోయింది. పిడుగుపాటు శీనప్ప షాక్ గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇంటిపై పిడుగు పాటుకు గురైన ప్రాంతం
పిడుగుపాటుకు కాలిపోయిన వైర్లు

బీర్జేపల్లెలో పిడుగు పాటు