
పెరిగిన గార్గేయ ఉధృతి
సదుం: మండలంతో పాటు ఎగువన సోమల మండలంలో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి మండల పరిధిలోని గార్గే య నదిలో వరద ప్రవాహం పెరిగింది. కొర్లగుంటవారిపల్లె సమీపంలోని కల్వర్లుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు కొంత మేర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉత్కంఠగా చదరంగం పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నియోజకవర్గ స్థాయి చెస్ పోటీలు ఆదివారం ఉత్కంఠగా సాగాయి. చిత్తూరు నగరంలోని వేపమాను వీధిలో ఉన్న ది స్కూల్ ఆఫ్ చెస్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అండర్– 7 విభాగంలో ఆదిత్య, ఆర్యన్, సిద్ధార్థ్, అండర్– 9 విభాగంలో ద్వారకా అర్జున్, మణిదీప్, సాత్విక్, అండర్–12లో అనంతనిత్య, కుందశ్రీ, విక్రాంత్, అండర్–16లో యశ్వంత్ సాయికార్తిక్, అక్షర, లోహిత్ వరుస స్థానాల్లో విజేతలుగా గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు ఏపీ చెస్ అసో సియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ బహుమతులు, సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల సోమనాథ్, లేఖ్య, దినేష్, సాయి, హరి, హరీష్ పాల్గొన్నారు.
పంటలు ధ్వంసం
పులిచెర్ల(కల్లూరు): ఏనుగుల దాడులతో పంటలు సర్వనాశనమవుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున మండలంలోని పాళెం పంచాయతీ, జూపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు ప్రవేశించి పంటలను నాశనం చేశాయి. ఎక్కువగా మామిడి కొమ్మలను విరిచేయడం, తోట చుట్టూ వేసిన ముళ్ల కంచెను తొక్కేయడం, పశుగ్రాసాన్ని తొక్కి చిందర వందర చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏనుగులు రాకుండా అధికారులు కట్టడి చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

పెరిగిన గార్గేయ ఉధృతి

పెరిగిన గార్గేయ ఉధృతి

పెరిగిన గార్గేయ ఉధృతి