అధ్వాన్నంగా గ్రామీణ రహదారులు
నిండ్ర : అధ్వాన్నంగా రహదారి
చిత్తూరు : ఇందిరానగర్ వద్ద మురుగునీటి మధ్యే రాకపోకలు
తిరుపతి..చిత్తూరు జిల్లాల్లో గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో పూర్తిగా ఛిద్రమయ్యాయి. సంక్రాంతి నాటికే రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. అడుగుకో మడుగును తలపిస్తున్న మార్గాల్లో పల్లెవాసుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలోనే ఇసుక.. గ్రావెల్ మాఫియా కారణంగా రహదారులు మరింతగా దెబ్బతిన్నాయి. అతి వేగంతో వెళుతున్న భారీ వాహనాల తాకిడికి సీసీ రోడ్లు సైతం శిథిలావస్థకు చేరాయి. అక్కడక్కడా నాణ్యతాప్రమాణాలను గాలికి వదిలి అరకొరగా మరమ్మతులు చేసిన మార్గాలు కూడా మళ్లీ ధ్వంసమయ్యాయి. ఈ మేరకు కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్లెదారులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. ఈ ఏడాది పెద్ద పండుగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు చేరుకునే వారికి చూడముచ్చటైన మార్గాలు స్వాగతం పలుకుతాయని ప్రకటనలు గుప్పించి.. దీపావళి వచ్చినా గతుకుల.. అతుకుల రోడ్లతోనే సరిపెట్టి అవస్థలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, తిరుపతి
జీడీ నెల్లూరు: ఏటుకూరుపల్లిలో రోడ్డు దుస్థితి
నరక దారి
నరక దారి
నరక దారి
నరక దారి
నరక దారి
నరక దారి
నరక దారి