
రికార్డుల్లోనే ఖర్చులు.. క్షేత్ర స్థాయిలో కనిపించని పను
జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల్లో అక్రమాలలో పుంగనూరు నియోజకవర్గం టాప్‌గా నిలిచింది. నియోజకవర్గంలోని మూడు మండలా లు అక్రమాలలో అగ్రస్థానంలో ఉంది. పులిచెర్ల మండలంలో మొత్తం రూ.16.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.12.13 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.94 కోట్లు , రొంపిచెర్ల మండలంలో రూ.15.01 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.13.45 కోట్లు, మెటీరియల్ కింద రూ.1.65 కోట్లు, సోమల మండలంలో రూ.10.99 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.7.32 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.67 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు.