
● ఇద్దరూ గ్రానెట్ క్వారీలో కార్మికులు ● హతుడు, నిందితు
బాబాయ్‌ను
హత్య చేసిన అబ్బాయ్
పుత్తూరు : బాబాయ్‌ని అబ్బాయ్ కత్తితో పొడిచి చంపిన ఘటన పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. సీఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా.. పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో భోజనాల సమయంలో నరేష్‌నాయక్(45)ను అతడి అన్న కుమారుడైన రాజేష్‌నాయక్(22) కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. మొహిగూడ గ్రామం, గన్‌జామ్ జిల్లా, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నరేష్‌నాయక్, ఇతని కుమారుడు కిరణ్‌చంద్రనాయక్, అన్న బలరామ్‌నాయక్, అతని కుమారుడు రాజేష్‌నాయక్ రెండు నెలలుగా చెర్లోపల్లి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. వీరందరూ చెర్లోపల్లి గ్రామ సమీపంలోని శబరి గ్రానెట్ క్వారీలో పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవు రావడంతో అందరూ చెర్లోపల్లి గ్రామంలోనే ఉన్నారు. మంగళవారం భోజనాల సమయంలో నరేష్‌నాయక్(45), రాజేష్‌నాయక్(22) ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కూరగాయలు తరిగే కత్తితో రాజేష్‌నాయక్, తన చిన్నాన్న అయిన నరేష్‌నాయక్‌ను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దీంతో నరేష్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు కిరణ్‌చంద్రనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో
వ్యక్తి మృతి
తవణంపల్లె : మండలంలోని ఉత్తర బ్రాహ్మణపల్లె వద్ద కోళ్లఫారంలో పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందడంతో అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఐరాల మండలంలో మొరం గ్రామంలోని జగనన్న కాలనీకి చెందిన చిరంజీవి(38), భార్య వల్లెమ్మ ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన మురళి కోళ్లఫారంలో ఏడాదిగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి మూర్చ రావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వివరించారు. చిరంజీవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వల్ల్లెమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
నిందితుడు
రాజేష్‌నాయక్ (ఫైల్)
హతుడు
నరేష్‌నాయక్ (ఫైల్)

● ఇద్దరూ గ్రానెట్ క్వారీలో కార్మికులు ● హతుడు, నిందితు