
ఇరువర్గాల ఘర్షణ
శ్రీరంగరాజపురం : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని పొదలపల్లిలో చోటు చేసుకుంది. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కథనం మేరకు పొదలపల్లి గ్రామంలో సోషియల్ మీడియాలోని వాట్సాప్ గ్రూప్‌లో ఇరువర్గాలు అయిన ఏకాంబరం అలాగే ఆనంద్ ఇరువురు పరస్పరం అసభ్యకరమైన రీతిలో పోస్టులు రెచ్చగొట్టే విధంగా పెట్టడంతో రెండు వర్గాలు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి పొదలపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఏకాంబరం, ఆర్.భరత్, ఆర్.లోకేష్, యం.రాజేష్, ఆర్.చరణ్ మారణాయుధాలతో ఆనందరావు ఇంటిపై దాడి చేశారు. దీంతో ఆయనతో పాటు వారు కుటుంబ సభ్యులు భారతి, జానీలకు గాయాలు కావడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.