
రోడ్డు ప్రమాదంలోవలంటీర్ మృతి
పలమనేరు : మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటకు చెందిన సంతోష్(35) మంగళవారం రాత్రి కర్ణాటక రాష్ట్రంలోని ముళబాగిళు వద్ద హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బెంగళూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు అక్కడి పొలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముళబాగిళు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యాపిల్లలున్నారు. గత ప్రభుత్వంలో నీళ్లకుంటలో వలంటీర్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవలందించాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను తొలగించడంతో బతుకు తెరువు కోసం బెంగళూరుకు వెళ్లి అక్కడ డెలవరీ బాయ్‌గా పనిచేస్తుండేవాడు. దీపావళి పండగ కోసమని ఇంటికొస్తుండగా కానరానిలోకాలకెళ్లాడు. సంతోష్ మృతితో నీళ్లకుంటలో విషాదం అలుమకుంది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
సదుం : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..కొత్తపల్లెకు చెందిన విజయ(45) భర్త చంద్రశేఖర్ గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె పీలేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. గత మంగళవారం ఉదయం విధుల కోసం వెళ్తూ తిరిగి రాలేదు. 15న ఉదయం విజయ మృతదేహాన్ని పుట్టావారిపల్లె బస్‌స్టాప్ సమీపంలో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే దారిలో గుర్తించిన కొందరు ఆమె కుమారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు. ఆమె కుమారుడు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
యువజనోత్సాహం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెట్విన్ సీఈవో యశ్వంత్ మాట్లాడుతూ.. నేటి యువత స్వామి వివేకానంద సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువత కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో బాలాజీ, సెట్విన్ మేనేజర్ మోహన్‌కుమార్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలోవలంటీర్ మృతి

రోడ్డు ప్రమాదంలోవలంటీర్ మృతి