
మదనపల్లెను జిల్లా చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం
పుంగనూరు : మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు పుంగనూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షుడు చందు, సీపీఐ , ఏఐటీయూసీ, మాల మహానాడు నాయకులు వెంకట రమణారెడ్డి, ఎన్‌ఆర్.అశోక్ ఆధ్వర్యంలో పలువురు కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారని తెలిపారు. ప్రస్తుతం హామీని అమ లు చేయాలని , పుంగనూరు, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అందరితోనూ కలసి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో గంగరాజు, నరసింహులు, శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, జెవి.నాగరాజు, అజప్ప త దితరులు పాల్గొన్నారు.