‘నవోదయం’ నగుబాటు! | - | Sakshi
Sakshi News home page

‘నవోదయం’ నగుబాటు!

Oct 9 2025 2:53 AM | Updated on Oct 9 2025 2:53 AM

‘నవోదయం’ నగుబాటు!

‘నవోదయం’ నగుబాటు!

‘సారా’ మాన్పించడంపై ఎకై ్సజ్‌ శాఖ కసరత్తు 239 కుటుంబాలకు రుణాల మంజూరుకు నివేదిక సిబిల్‌ స్కోర్‌ లేక ఒక్కరికీ పైసా ఇవ్వని బ్యాంకర్లు చాపకింద నీరులా విస్తరిస్తున్న నాటుసారా ?

చిత్తూరు అర్బన్‌ : నాటు సారాకు సిబిల్‌ స్కోరుకు సంబంధం ఏంటనేగా సందేహం. అధికారులు తలుచకుంటే దేనికై నా లింకులు పెట్టగలరు. జిల్లాలో నాటుసారా వృత్తిని మాన్పించి.. ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెరపైకి తీసుకొచ్చిన నవోదయం 2.0 నవ్వులపాలవుతోంది. ఎవరెన్ని చెప్పినా తమ నిబంధనలు మారవంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో పంచాయతీ కలెక్టర్‌ వద్దకు వెళ్లనుంది.

సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంచుకున్న కుల వృత్తులు, ఎదురైన పరిస్థితులు అట్టడగు పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. జిల్లాలోని కొన్ని వర్గాలు పల్లెల్లో సేద్యం చేసుకోవడానికి భూముల్లేక, ఉండటానికి సొంత ఇళ్లులేక రెండు, మూడు తరాల కిందట ఎంచుకున్న నాటు సారా తయారీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడిగా సారా తయారీను వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలు ఆ ఊబి నుంచి బయటకు రాలేకున్నాయి. ఇదే సమయంలో కూలీలకు డబ్బులు ముట్టజెప్పి రూ.కోట్లు గడించిన వాళ్లు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా మారిపోయాయి. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నవోదయం తీసుకొచ్చినా.. సారా తయారీ కుటుంబాలపై సమాజంలో అసమానతలను తొలగించడంలో విఫలమయ్యింది.

సిబిల్‌ స్కోర్‌ లేదు.. రుణాలు ఇవ్వం

సారా మాన్పించడానికి ఎవరెవరికి ఏయే రుణాలు ఇవ్వాలనేదానిపై ఎకై ్సజ్‌ అధికారులు ఓ నివేదిక సిద్ధంచేసి కలెక్టర్‌కు ఫైలు పంపించారు. తొలుత తాకట్టులేనిదే రుణం ఇవ్వబోమని మొండికేసిన బ్యాంకర్లు.. కలెక్టర్‌ చీవాట్లు పెట్టడంతో సరేనన్నారు. తీరా ఇప్పుడేమో అధికారులు ప్రతిపాదించిన వాళ్లకు సిబిల్‌ స్కోర్‌ లేదని, రుణాలు మంజూరు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవంటూ మొండికేసి కూర్చుకున్నారు. సారా తయారీను వదలిస్తే రుణాలు ఇప్పిస్తామన్న ఎకై ్సజ్‌ అధికారులు మాటలు వట్టివేనంటూ ఇప్పటికే పలు కుటుంబాలు మళ్లీ సారా ఊబిలోకి దిగుతున్నాయి. వీటిని నడిపిస్తున్న వ్యక్తులు సైతం క్రమంగా నాటుసారా విస్తరిస్తూ పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అదే పేరు.. అదే తీరు..

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు జిల్లాలో ఎక్కడా నాటు సారా ప్యాకెట్‌ ఒక్కటి కూడా తయారు కాకూడదని ఎకై ్సజ్‌ శాఖకు బాధ్యతలు పురమాయించింది. చిత్తూరులోని రాసనపల్లె, పాలసముద్రంలోని నరసింహాపురం, నగరి సత్రవాడ, విజయపురం మంగళం, కెవి.పురం, పుంగనూరులోని పెద్దతండా, నల్లగుంట్లపల్లె తండా, పట్రపల్లె తండా ల్లాంటి 52 సారా తయారీ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా గుర్తించారు. సారా తయారీ తప్ప మరో దారితెలియని 239 కుటుంబాలను గుర్తించి.. వీళ్లకు స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకు రుణాలు ఇవ్వడమే ఏకై క మార్గమని నివేదిక రూపొందించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ఫైలు సిద్ధం చేయగా.. బ్యాంకర్ల నుంచి ఊహించని ట్విస్టు ఎదురయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement