
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పల్లె ముంగిటకే సేవలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య సేవలను పల్లె ముగింటకే తీసుకొచ్చింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. ఆ కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించింది. 150 రకాల మందులు, మాత్రలను అందుబాటులో ఉంచింది. 14 రకాల పరీక్షలు అక్కడే చేసేలా చర్యలు తీసుకుంది. కేంద్రం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తిస్తూ వచ్చింది. టెలీమెడిసన్ విధానం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసింది. తద్వారా పల్లె జనానికి వైద్య ఆరోగ్య సేవలను చేరువ చేసింది. ఈ సేవలను నిత్యం పర్యవేక్షిస్తూ..లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చర్యలు చేపట్టింది. పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్ల విధానాన్ని తీసుకొచ్చింది. పేషియల్ అటెండెన్స్‌ను తీసుకొచ్చి సేవలను పారదర్శకంగా అమలు చేసింది. పల్లె జనానికి ఆరోగ్య భరోసాను కల్పించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ వైద్య సేవలను నీరుగారుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.