– IIలో
– IIలో
న్యూస్‌రీల్
అమాయకులు బలి దీనికి చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలి కల్తీమద్యం పెద్దలను అరెస్ట్ చేయాలి చిత్తూరులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్ల ధ్వంసం
బాత్‌రూమ్‌లో జారిపడి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది.
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
చిత్తూరులో ఎకై ్సజ్ స్టేషన్ వద్ద మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు
‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో స్పిరిట్‌ను అడ్డదారిలో ఆంధ్రాలోకి రప్పించుకున్నారు. విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేశారు. వందల మంది ప్రాణాలతో
చెలగాటమాడారు. కొన్ని వందల
కుటుంబాలను రోడ్డున పడేశారు. అనేక
మంది ఆరోగ్యాల మీద దెబ్బకొట్టారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..?. వారి
కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు..?. వారికి అండగా ఎవరు నిలుస్తారు..? సీఎం చంద్రబాబునాయుడా..?!.. లోకేశా..
పవన్‌కళ్యాణా..?. సమాధానం చెప్పాలి..’ అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ మద్యం పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు జిల్లా కేంద్రంలో నిరసనలు మిన్నంటించారు.
చిత్తూరు అర్బన్: ‘నారా’వారి కల్తీ మద్యానికి అమాయకులు బలవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు నుంచి కల్తీ మద్యం ఏపీ మొత్తానికి సరఫరా అయ్యింది. ఆఫ్రికాలో ప్రణాళికలు రూపొందించి, పేదల ప్రాణాలను తీశారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కల్తీ మద్యం కేసులో పెద్దలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హై రోడ్డు నుంచి స్థానిక అర్బన్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీమద్యం తయారీ, కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం మొత్తానికి పాకిందన్నారు.
ఈ మౌనం దేనికి సంకేతం?
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం బ్రాండ్లలో కుట్ర జరిగిపోయిందని మసిపూసి మారేడు కాయ చేశారు. తమ నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించారు. ఏదో జరిగిపోయిందంటూ గ్లోబెల్స్ ప్రచారానికి దిగారు. ఇప్పుడు నకిలీ మద్యంలో కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయినా మౌనంగా ఉన్నారు. ఇది దేనికి సంకేతం...?’ అంటూ మహిళా నేతలు నిలదీశారు.
సరి‘హద్దు’లు దాటిన కల్తీ మద్యం
జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు దాటుకుని స్పిరిట్ చిత్తూరులోకి వస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహిళా నేతలు ఆరోపించారు. ఏడాదికిపైగా కల్తీ మద్యం జోరుగా సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అనంతరం ఎకై ్సజ్ పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పీవీ.గాయత్రీదేవి, లీనారెడ్డి, మునిసిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి రెడ్డి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు హరీషారెడ్డి, కార్పొరేటర్ భాగ్యలక్ష్మిరెడ్డి, కౌసర్, పూంగొడి, బిందు, శాంతి, లత, విజయశాంతి, సృజన పాల్గొన్నారు.
ఏరులై పారుతున్న కల్తీ మద్యం