
ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మురకంబట్టు ప్రాంతంలో ఏఆర్ కానిస్టేబుల్ రవితేజనాయక్ విధులు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ నిత్యబాబు, ఎస్‌ఐ మల్లికార్జున విచారణ చేపట్టారు.
వరసిద్ధుని సేవలో కర్ణాటక మంత్రి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామిని గురువారం కర్ణాటక రాష్ట్ర మంత్రి సీహెచ్ మునియప్ప దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.

ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు