
పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం
– 2 కే రన్ ప్రారంభించిన ఎంపీ
చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటక రంగం అభివృద్ధి రాష్ట్రానికి అవసరమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని శనివారం పర్యాటక దినోత్సవం నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ మైదానం వరకు 2 కే రన్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధితో పాటు ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ, సీఐ మహేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.