
ప్రజల్లోకి ‘సూపర్ జీఎస్టీ .. సూపర్ సేవింగ్స్’
చిత్తూరు అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథరెడ్డి, కమిషనర్ పి.నరసింహప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై ఆర్పీలు, సీవోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కమిషనర్ మా ట్లాడుతూ.. నూతన జీఎస్టీ శ్లాబులు, సేవింగ్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో వాణిజ్య పనులు శాఖ డిప్యూటీ కమిషనర్ పరదేశి నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌కుమార్, సహాయ కమిషనర్ ఏ.ప్రసాద్, ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ వెంకట రామిరెడ్డి, ఇన్‌చార్జ్ సీఎంఎం గణేష్, పాల్గొన్నారు.