
వైభవోత్సవం
బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భద్రతా సిబ్బంది హడావుడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమల
హనుమంత వాహనంపై కోదండరాముడు
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సరస్వతీ..నమోస్తుతే!
దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు అయిన సోమవారం బోయకొండ గంగమ్మ చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం తోపాటు ఉభయదారులు ప్రత్యేక హోమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు.
చౌడేపల్లె

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం

వైభవోత్సవం