
సారా రహిత జిల్లానే లక్ష్యం
కార్వేటినగరం: సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ స్పష్టం చేశారు. గురువారం కార్వేటినగరం ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషన్ మాట్లాడుతూ సారా తయారీ, విక్రయాలు, బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 14405 ద్వారా సమాచారం అందించాలన్నారు. సహకరించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సారా కేసుల్లో పట్టుబడి ఆ వృత్తిని విరమించుకుని జీవనం సాగించే వాళ్లకి పాడి ఆవులు, ఆటోలు లాంటివి అందించి ప్రత్యామ్నాయంగా సహాయం అందిస్తామన్నారు. వైన్‌షాప్ సమీపంలో పర్మిట్ రూములకు అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్‌రెడ్డి, చిత్తూరు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, ఎకై ్సజ్ సీఐ శిరీషాదేవి, ఎస్‌ఐ శ్రావణకుమార్ పాల్గొన్నారు.