
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
రొంపిచెర్ల: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండా లని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. గురువారం రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ డ్రగ్స్ వాడకంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయన్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రుల నిఘా ఉంచాలన్నారు. ప్రతి రోజూ కొంత సేపు పిల్లలతో కలసి ఉండాలన్నారు. పిల్లలు ఏమి చేస్తున్నారో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలకు పిల్లలు సక్రమంగా వెళ్లుతున్నారా? లేదా అని పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం నెలకు ఒక విద్యార్థిపై రూ.5 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పిల్ల లు విద్యార్థి దశలో సోషల్ మీడియా, సెల్‌ఫోన్లకు బానిసలవుతూ ఆట పాటలకు దూరం అవుతున్నా రని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలపై రుద్దడంతో వారు విజయాలు సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చదువుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. అలాగే పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన రిషిత, భరత్ కుమార్, వీణావాణికి షైనింగ్ అవార్డులు, సాధియా, రీద, గీతాశ్రీకి ఎన్‌ఎంఎంఎస్ అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ అమరనాఽథ్, ఎంఈఓ శ్రీనివాసులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.