తానా కార్యదర్శిగా సునీల్‌ పాంట్ర | - | Sakshi
Sakshi News home page

తానా కార్యదర్శిగా సునీల్‌ పాంట్ర

Jul 11 2025 6:25 AM | Updated on Jul 11 2025 6:25 AM

తానా

తానా కార్యదర్శిగా సునీల్‌ పాంట్ర

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) కార్యదర్శిగా జిల్లాకు చెందిన సునీల్‌ పాంట్ర ఎన్నికయ్యారు. తానా సంఘంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పలు పదవులు అనుభవించారు. ఈ నేపథ్యంలో తానా కార్యదర్శిగా ఎంపికయ్యారు. కాగా ఆయన మన రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు.

ఘనంగా సత్యనారాయణ వ్రతం

కాణిపాకం: గురుపౌర్ణమి సందర్భంగా కాణిపాకంలో సత్యనారాయణస్వామి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీభూదేవి సమేత శ్రీవరదరాజులస్వామి ఆలయంలో గురువారం పౌర్ణమి పూజలు చేశారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు విశేషాలంకరణ చేసి, అర్చన జరిపారు. అనంతరం సత్యనారాయణ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్ని వ్రతం ఆచరించి, తరించారు.

తానా కార్యదర్శిగా సునీల్‌ పాంట్ర
1
1/1

తానా కార్యదర్శిగా సునీల్‌ పాంట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement