
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు.
జగన్ పర్యటన సక్సెస్
చిత్తూరు కార్పొరేషన్: పోలీసులను అడ్డం పె ట్టుకుని ప్రభుత్వం ఎ న్ని అడ్డంకులు సృష్టించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప ర్యటన విజయవంతమైందని వైఎస్సార్ సీపీ రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రైతు విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, ఎఫ్‌ఎఫ్‌ఏ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచ్ మధుసూదన్‌రాయల్ మాట్లాడారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారికి మద్దతుగా జగనన్న బంగారుపాళెం పర్యటనకు వచ్చారన్నారు. జగనన్న పర్యటన కార్యక్రమాన్ని ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి రైతులపై హఠాత్తుగా ప్రేమ వచ్చిదంన్నారు. ఆకస్మాతుగా వారితో అధికారులు సమావేశాలు పెట్టి హడావుడి చేశారన్నారు. జగనన్న పర్యటనకు 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చామన్నారు. కానీ ఎందుకు 2 వేల మందికి పైగా పోలీసులు పెట్టి అడుగడు గున అడ్డంకులు సృష్టించారని ప్రశ్నించారు. ఎంత ప్రయత్నం చేసి అధినేతపై రైతులకు ఉండే ఆదరణ, అభిమానాన్ని అపలేకపోయారన్నారు. కొండలు, గు ట్టలు దాటుకుని మార్కెట్‌యార్డుకు వేలాది మంది వచ్చారన్నారు. పర్యటనను ఫ్లాప్ చేయాలని పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసి, రైతులను కొట్టారన్నారు.
రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా?
వేలాది మంది రైతులు రావడం చూసి ఓర్వలేని ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దండుపాళ్యం బ్యాచ్‌తో పోలుస్తూ వార్తలు రాయ డం సరికాదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు వేలాది టోకెన్లు అక్రమంగా తీ సుకున్నారన్నారు. వారు చెప్పిన వారికి మాత్రమే ఫ్యాక్టరీల్లో త్వరగా పంటను దింపుకున్నరన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రూ.16 ఇస్తున్నారని చెప్పారు. విజనరీ సీఎంగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కిలో మామిడి రూ.8 కూడా ఎందుకు కోనుగోలు చేయలేకపోతున్నరని ప్రశ్నించారు.
రైతులంటే ప్రేమ లేదు
చంద్రబాబుకు రైతులంటే ఎప్పుడు ప్రేమ లేదని గ్రీనరి బ్యూటిఫికేషన్ రాష్ట మాజీ డైరెక్టర్ గుణశేఖర్‌రెడ్డి, సర్పంచ్ అమరనాథ్‌రెడ్డి, ఏకాంబరం, నాయకులు రవీంద్రరెడ్డి విమర్శించారు. 1996లో బషీర్‌బాగ్‌లో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై కాల్పులు జరిపిన ఘనత బాబుదన్నారు. తర్వాత వారి కుటుంబాలకు సైతం పరిహారం ఇవ్వలేదన్నారు. మంత్రి అచ్చెనాయుడు చిత్తూరుకు వచ్చి పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం నిర్వహించిన తరువాత వారి పరిస్థితి ఇంకా దారుణంగా మారిందన్నారు.

మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ