
వర్క్‌ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలి
చిత్తూరు కార్పొరేషన్: పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ గురవయ్య ఆదేశించారు. శనివారం ఎస్‌ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్ డివిజన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూతలపట్టు, యాదమరి, ఐరాల రూరల్స్ ఏఈలు నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు డబ్బులు చెల్లించి ట్రాన్స్‌ఫార్మర్లు కోసం వేచి చూస్తున్నారన్నారు. వారికి సకాలంలో వ్యవసాయ సర్వీసులను విడుదల చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని చెప్పారు. వేగంగా మరమ్మతులు చేయడానికి చిత్తూరులో అందులోబాటులో ఉన్న నూతన ఓఆర్‌ఎంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్‌డివిజన్ పరంగా పరిశీలన పనులు డీఈలు ఇంటర్ చేంజ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి లైన్ సమస్యలను పరిష్కారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వరమైన ఆర్‌డీఎస్‌ఎస్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి సారీ సాకులు చెబుతూ పనులను ఆలస్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్, ఈఈలు మునిచంద్ర, జగదీష్, అమర్‌బాబు, ఏఓ ప్రసన్న ఆంజనేయులు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.