కొండంత జనం | - | Sakshi
Sakshi News home page

కొండంత జనం

Jul 14 2025 4:43 AM | Updated on Jul 14 2025 4:43 AM

కొండం

కొండంత జనం

అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం బోయకోండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

కారు దగ్ధం..తప్పిన ప్రమాదం

బంగారుపాళెం మండలంలో ఆదివారం పాలేరు ఫ్లైఓవర్‌ సమీపంలో కారు టైరు పేలి బోల్తాపడి దగ్ధమైంది.

సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం..తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో విద్యార్థుల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్‌ స్వీకరించడంతో ఈ పథకంపై పెద్ద ఎత్తున అర్జీలను విద్యార్థుల తల్లులు అందజేశారు. ఎవరు ఏ సమస్య వల్ల అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటి ఆధారంగా అవసరమైన పత్రాలను జత చేసి గ్రీవెన్స్‌కు అర్జీలు అందజేశారు. అయితే ఆ అర్జీలు వివిధ దశల్లో అధికారులు ఆమోదించాల్సి ఉండటంతో పరిష్కారానికి నోచుకోని దుస్థితి నెలకొంది.

అర్హులైనా..అనర్హులుగా

తల్లికి వందనం పథకం అర్హత ఉన్నప్పటికీ గతంలో అమ్మఒడి పథకం పొందినప్పటికీ ఈ ఏటా అనర్హులుగా చూపించారు. అదే విధంగా చాలా మంది విద్యార్థుల తల్లులకు సంబంధం లేని సమస్యలను వారికి అంటగట్టి అనర్హులుగా జాబితాలో పెట్టారు. దీంతో జిల్లాలో తల్లికి వందనం వర్తింపజేయాలంటూ అర్జీలు సచివాలయాల్లో పోటెత్తాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ తల్లులు సచివాలయాలకు క్యూ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడో కారు విక్రయించేసినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు. విద్యుత్‌ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్‌న్‌కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ అధిక సంఖ్యలో తల్లులు అర్జీలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 1,890 మంది తల్లులు అధికారికంగా అర్జీలు దాఖలు చేశారు. వీరే కాకుండా అవగాహన లేక దరఖాస్తు చేసుకోవాల్సిన తల్లులు మరో వెయ్యి మంది ఉండొచ్చని అంచనా.

జిల్లాలో 1,890 అర్జీలు నమోదు

జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,890 అర్జీలు పోటెత్తాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్‌ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్‌ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్‌ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేసి ఆధారాలు చూపుతూ అర్జీలు పెట్టుకుంటున్నారు. తమ పేరుపై అనేక విద్యుత్‌ మీటర్లు సీడింగ్‌ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.

తమ కారు విక్రయించేసినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదా యం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు.

అర్జీల పరిశీలనలో అలసత్వం

తల్లికి వందనం పథకంలో వివిధ శాఖలకు పంపుతున్నా అర్జీల పరిశీలనలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కారుకు సంబంధించి జిల్లా రవాణా శాఖ, ఆదాయపు పన్ను అర్జీలను తహసీల్ధార్‌, ఇలా పలు సమస్యల అర్జీలను ఆయా శాఖల అధికారుల లాగిన్‌లకు పంపారు. అయితే సంబంధిత అర్జీలు ఆయా అధికారుల లాగిన్‌లలో నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదానికి నోచుకోక అలానే పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వేల మంది తల్లులు అర్జీల పురోగతి కోసం నిత్యం సచివాలయాల చుట్టూ తిరిగి వేశారి పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ 581 అర్జీలు నమోదు అయ్యాయి. ఆ అర్జీలను మొదటగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా అక్కడ నుంచి వీఆర్‌వోకు, ఆ తర్వాత తహసీల్ధార్‌, అనంతరం ఆర్డీవో, చివరికి జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌కు చేరుతాయి. ఇలా నమోదైన 581 అర్జీల్లో ఇప్పటి వరకు కేవలం 4 అర్జీలు మాత్రం ఆమోదించారు. అదే విధంగా ఇన్‌కం ట్యాక్స్‌ సమస్యలపై 263 అర్జీలు నమోదయ్యాయి. ఈ అర్జీల్లో ఇప్పటి వరకు 3 అర్జీలు మాత్రం ఆమోదించారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : నగరిలో అక్రమ గ్రావెల్‌ క్వారీలు, పలు సమస్యల పరిష్కారానికి ఈనెల 14న సీపీఐ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. నగరిలో అక్రమ గ్రావెల్‌ క్వారీలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుండ్రాజ కుప్పం దళితులు హైవేలో ఇళ్లు కోల్పోతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పలు డిమాండ్లు పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నేడు ప్రజాసమస్యల

పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలుంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

22న మామిడి

రైతు మహా జనసభ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రపంచ మామిడి దినోత్సవ సందర్భంగా ఈనెల 22న మామిడి రైతు మహా జనసభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతు సంక్షేమ సంఘం నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సభను ఏర్పాటు చేశామని, ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సంఘ సమావేశం ప్రారంభమవుతుందని, మామిడి రైతులు పాల్గొనాలని కోరారు.

గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపంజాణి : మండలంలోని శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిభా పూలే బాలికల గురుకుల పాఠశాల (ఇంగ్లిష్‌ మీడియం)లో 2025–26 సంవత్సరానికి గానూ 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ జోత్స్న తెలిపారు. ఈనెల 20 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్థానిక గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలకు వచ్చేవారు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌ జిరాక్స్‌, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌ తీసుకుని ఈనెల 12 నుంచి 18వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం లోపు పాఠశాలలో అందజేసి హాల్‌ టికెట్‌ తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 95157 64818 ఫోన్‌ నంబరును సంప్రదించాలని కోరారు.

చిత్తూరు సచివాలయంలో తల్లికి వందనం సమస్యల అర్జీలు ఇస్తున్న తల్లిదండ్రులు (ఫైల్‌)

రెండవ విడతకు కాలయాపన

తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం జూన్‌ 13న అమలు చేసింది. నేటితో ఒక నెల పూర్తి అవుతోంది. చిత్తూరు జిల్లాలో 2,64,679 మంది విద్యార్థులకు సంబంధించి 1,30,382 మంది తల్లుల ఖాతాల్లో రూ.169.50 కోట్లు జమ చేశారు. అయితే మొదటి విడత మంజూరు కాని విద్యార్థులకు రెండో విడతలో పథకం నగదు జమ చేస్తామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఆర్భాటంగా చెప్పారు. మొదట రెండో విడత నగదును జులై 5వ తేదీన వేస్తామన్నారు. ఆ తర్వాత జులై 10వ తేదీ అన్నారు. ఈ రెండు తేదీలు గడిచిపోయినా ఇంకా నగదు జమ కాని దుస్థితి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థుల తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఆటవిక పాలన

పలమనేరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు విమర్శించారు. పలమనేరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ బీసీ మహిళైన ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ, జనసేన గుండాలు మారణాయుధాలతో దాడి చేయడం దారుణమన్నారు. మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల సాక్షిగా జరుగుతున్నా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా ప్రథమ పౌరురాలకే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

జిల్లాలోని తల్లికి వందనం పథకంలో తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ చిత్తూరు అర్బన్‌లో 90, కుప్పం అర్బన్‌లో 28, కుప్పం రూరల్‌లో 28 మంది విద్యార్థుల తల్లులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల నమోదు చేసి నెల రోజులు అవుతున్నా మోక్షం కలగని దుస్థితి. ఇదే కాదు జిల్లాలోని అన్ని మండలాల్లో తల్లికి వందనం అర్జీల పరిష్కార పరిస్థితి ఇలానే ఉంది.

చిత్తూరు జిల్లాలో 1,890 అర్జీల నమోదు

పరిష్కారానికి నోచుకోని ‘తల్లికి వందనం’ అర్జీలు

సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణలు

రెండో విడత మంజూరులో కాలయాపన

కూటమి ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. మొదటి జాబితాలో పథకం వర్తించని వారు రెండో జాబితాకు ఎదురు చూస్తున్నారు. అర్హులైనప్పటికీ అనర్హులని మొదటి విడత తల్లికి వందనంలో చాలా మంది విద్యార్థులకు పథకం ఎగ్గొట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది తల్లులకు తల్లికి వందనం అర్జీలతో సచివాలయాల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ అర్జీలు పరిష్కారానికి నోచుకోక విద్యార్థుల తల్లులు...తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అర్జీలపై సాక్షి ఫోకస్‌.

జిల్లా సమాచారం

నమోదైన పెండింగ్‌లో

అర్జీలు ఉన్న అర్జీలు

ప్రభుత్వ ఉద్యోగులం

కాదంటూ 581 577

ఇన్‌కంట్యాక్స్‌ సమస్యలు 263 260

ఈకేవైసీ సమస్యలు 1,046 1,026

మొత్తం అర్జీలు 1,890 1,863

సర్కారు తీరు సరికాదు

తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని విస్మరించింది. ఒక కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చి మిగిలిన పిల్లలకు కొర్రీల పేరుతో తొలగించారు. అదే విధంగా చాలా మందికి గతంలో అమ్మఒడి వర్తించినప్పటికీ ఇప్పుడు తల్లికి వందనం ఎందుకు వర్తించదో అర్థం కావడం లేదు. అర్జీలను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి

కొండంత జనం
1
1/4

కొండంత జనం

కొండంత జనం
2
2/4

కొండంత జనం

కొండంత జనం
3
3/4

కొండంత జనం

కొండంత జనం
4
4/4

కొండంత జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement