
కొండంత జనం
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ ఆలయం భక్తులతో ఆదివారం కిక్కిరిసింది. అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం న కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఎటుచూసినా భకజన సందోహం నెలకొంది. అమ్మవారిని బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నేవైద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయంలోని క్యూలైన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. గంటల తరబడి నిరీక్షించి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సుమారు 50 వేల మందికిపైగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఊహంచని రీతిలో వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, వాహనదారులు అవస్థలు పడ్డారు.
కిక్కిరిసిన బోయకొండ ఆలయం
రద్దీగా మారిన క్యూలు
బోయకొండ ఒక్క రోజు ఆదాయం రూ.28.60 లక్షలు
బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రూ:28.60 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఆలయంలో భక్తులకు విక్రయించిన వివిధ రకాల సేవా టికెట్లు, ప్రసాదం, తీర్థం టికెట్లు ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు చెప్పారు.

కొండంత జనం