
ఎస్సీల సమస్యలపై అలుపెరుగని పోరాటం
పలమనేరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యద ర్శిగా శ్యామ్‌సుందర్‌రాజు నియమితులైనట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పలమనేరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీల సమస్యలపై పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా ముందుకెళతామన్నారు.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
కార్వేటినగరం: ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. దీనిపై తహసీల్దార్ నాగరాజు స్థానిక సీఐ హనుమంతప్పకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ కంఠం ధ్రువపత్రాల కోసం మండలంలోని కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో టీకేఎంపేట గ్రామానికి చెందిన కుమారస్వామి తన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెవెన్యూ అధికారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉండగా.. కొందరు వాటిని నకిలీ సంతకాలు పెట్టి మంజూరు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు స్థానిక సీఐకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.