
కూటమి మోసాలు ఎండగడుదాం
తవణంపల్లె: చంద్రబాబు, పవన్‌ల మోసపూరిత వాగ్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని, అందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని కాణిపాకం రోడ్డులో నారాయణాద్రి కల్యాణ మండపంలో బాబు షూరిటీ–మోసం గ్యారెంటీలో భాగంగా వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన మోసపూరిత హామీలను, వైఎస్సార్‌సీపీ పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన 143 హామీలు, సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండానే బుకాయిస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం పర్యటనతో కూటమి నాయకుల్లో వణుకు పుట్టిందన్నారు.
కలసికట్టుగా శ్రమిద్దాం
పూతలపట్టు నియోజకవర్గం నుంచే ఉద్యమం చేపడుదాం
బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూ ఆర్‌కోడ్ ఆవిష్కరణలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన పిలుపు
మోసం..బాబు నైజం
పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. బాబు షూరిటీ– మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్రంగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ ప్రజలను మోసగించడం చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ ఇచ్చిన వాగ్ధానాలను ఏడాదిలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారన్నారు. అనంతరం బాబూ ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. తవణంపల్లె, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల పార్టీ అధ్యక్షులు హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, జయచంద్రారెడ్డి, ధనంజయరెడ్డి, పార్టీ నాయకులు తలపులపల్లె బాబురెడ్డి, కుమార్‌రాజ, మోహన్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, గజేంద్ర, ప్రకాష్‌బాబురెడ్డి, సుకేష్‌రెడ్డి, తేజారెడ్డి, కుమార్, గౌహతిసుబ్బారెడ్డి, సుగుణశేఖర్ రెడ్డి, రాజారత్నంరెడ్డి, సుధాకర్ రెడ్డి, దూర్వాసులురెడ్డి, ప్రబాకర్‌రెడ్డి, రమణారెడ్డి, కిషోర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శరత్‌రెడ్డి, మధుకుమార్, చిన్నారెడ్డి, మురుగన్, మణిరాజ్, పరదేశి, ప్రసాద్ పాల్గొన్నారు.

కూటమి మోసాలు ఎండగడుదాం