
ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు: పట్టణంలోని పలు క్రిమిసంహారక మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్, స్థానిక వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇక్కడి దుకాణాల్లో 892 బస్తాల యూరియా నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాకు వివరాలు, బిల్లు బుక్కులను తనిఖీ చేశారు. రైతులు కొన్న ఎరువులు, క్రిమిసంహారక మందులకు కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని దుకాణాల్లో ఎరువు ఽశ్యాంపిళ్లను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం అగ్రిల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు. అగ్రికల్చర్ ఏడీ ధనుంజయరెడ్డి, విజిలెన్స్ సీఐ రవి, స్థానిక ఏవో సంధ్య పాల్గొన్నారు.