
చిత్తూరు: ‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి’ అని నూతన వధువు మానస పోలీసులను వేడుకుంది. వివరాలు .. రొంపిచెర్ల మండలం, చెంచెంరెడ్డిగారిపల్లె పంచాయతీ, శ్రీరాముల వడ్డిపల్లెకు చెందిన చెంగల్‌రాయులు కుమార్తె మానస (22) తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, వెత్తలతడుకు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(27)తో రెండేళ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కలికిరి రాముడు గుడిలో ఈనెల 12వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కల్లూరు సీఐ సూర్యనారాయణను వేడుకున్నారు. మానస తల్లిదండ్రులను సీఐ విచారించి వారికి నచ్చజెప్పి ప్రేమికులను కలిపారు.