కోర్సుల కోత.. కాలేజీల మూత! | - | Sakshi
Sakshi News home page

కోర్సుల కోత.. కాలేజీల మూత!

Jul 14 2025 4:43 AM | Updated on Jul 14 2025 4:43 AM

కోర్స

కోర్సుల కోత.. కాలేజీల మూత!

● యూనివర్సిటీలలో పలు కోర్సులకు మంగళం ● మరిన్నింటిని రద్దు చేసే యత్నంలో ప్రభుత్వం ● అగ్రి పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెల్లిన కాలం ● సర్కారు వైఖరిపై విదార్థి సంఘాల ఆగ్రహం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బంగారు బాటలు వేసింది. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత విద్యారంగాన్ని విధ్వంసం చేస్తోంది. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ గ్రామీణ విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. అందులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో పలు కోర్సులకు మంగళం పాడేసింది. అడ్మిషన్లు లేవనే సాకుతో మరిన్నింటిని తొలగించేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్‌ను పూర్తిగా రద్దు చేసేసింది. అలాగే యానిమల్‌ హస్బెండరీ కోర్సును సైతం చెల్లుచీటీ రాసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక సాంకేతిక విద్యకు అధ్యాపకులను నియమించకుండా నిర్వీర్యం చేస్తోంది.

ఆశగా ఎదురు చూశాం

ఈ ఏడాది అగ్రి పాలిటెక్నిక్‌ కోర్సులో చేరాలని ఎంతో ఆశగా ఎదురు చూశా. మా సమీప బంధువు ఓ అమ్మాయి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసి విలేజ్‌ అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. నేను కూడా ఉద్యోగం సాధించి రైతులకు సేవ చేయాలనుకున్నా. కానీ ఈ ఏడాది తిరుపతిలో ఆ కోర్సును రద్దు చేశారని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. – సౌమ్య, విద్యార్థిని, తిరుపతి

బాధగా ఉంది

తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో మా అబ్బాయిని చదివించాలని అనుకున్నాం. కానీ ఈ ఏడాది నుంచి కోర్సును పూర్తిగా ఎత్తివేశారని తెలిసి చాలా బాధగా ఉంది. వ్యవసాయ విద్యను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సును దూరం చేయడం తగదు. దీంతో వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.

– రామయ్య, రైతు, తిరుపతి రూరల్‌

భ్రష్టుపట్టించారు

వర్సిటీలలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఎంతో ఆసక్తితో చేరే ఆర్ట్స్‌ గ్రూప్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వ్యవసాయ విద్యను దూరం చేసే నిర్ణయాలు మంచివి కావు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో అడ్మిషన్లు రద్దు చేసి మూసివేయడం దారుణం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు.

– మురళీధర్‌, వైఎస్సాఆర్‌సీపీ విద్యార్థి

విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి

తిరుపతి సిటీ : గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి విశ్వవిద్యాలయాలే దిక్కు. అయితే వర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందే ఆర్ట్స్‌ గ్రూప్‌లను క్రమేణా కుదిస్తూ వస్తోంది. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటూ మెర్జింగ్‌ పేరుతో పలు కోర్సులను ఇప్పటికే రద్దు చేసింది. ఈ ఏడాదిలో వర్సిటీలలో సుమారు 12 కోర్సులను తొలగించింది. టెక్నాలజీ పేరుతో ఏఐ, డేటా సైన్స్‌ అంటూ నూతన కోర్సులను ప్రవేశపెట్టినప్పటికీ బోధనకు నిపుణులైన అధ్యాపకులు లేకపోవడంతో సాంకేతిక విద్య సైతం గాడి తప్పుతోంది.

మూతపడిన వ్యవసాయ పాలిటెక్నిక్‌

గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతో ఆసక్తితో చేరే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సును పూర్తిగా తొలగించారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ ఎన్‌జీ రంగా వర్సిటీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నిరాశే మిగిలింది. అదే దారిలో వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌ కోర్సుకు సైతం త్వరలో గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవేశాలు తక్కువగా ఉన్నాయనే నెపంతో పలు కోర్సులకు మంగళం పాడుతున్న ప్రభుత్వ వైఖరిపై అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ఉన్నత విద్య దూరమవుతోంది

ప్రభుత్వం కారణంగా గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోంది. అందుకే వర్సిటీలలో పలు కోర్సులను రద్దు చేసింది. వ్యవసాయ పాలిటెక్నిక్‌తో ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అలాంటి కోర్సులను రద్దు చేసి ఏకంగా కళాశాలలనే మూసివేయడం దారుణం. – ఆర్‌.ఆషా,

పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి

కోర్సుల రద్దు సరికాదు

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిస్థాయిలో ఇంత వరకు విడుదల చేయలేదు. విద్యార్థుల ప్రవేశాలు తగ్గుముఖం పట్టడంతో వర్సిటీలు దయనీయస్థితిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టకుండా కోర్సులను రద్దు చేయడం సరికాదు. – ప్రవీణ్‌ కుమార్‌,

జిల్లా కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్‌, తిరుపతి

నిర్వీరం చేసే కుట్ర

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుకు ప్రభు త్వం మంగళం పాడేసింది. ఇదే తరహాలో మరిన్ని కోర్సులను రద్దు చేసి కార్పొరేట్‌ విద్యకు పెద్దపీట వేసేందుకు కుట్ర పన్నుతోంది. వర్సిటీలలో పెద్ద సంఖ్యలో మెర్జింగ్‌ పేరుతో పలు కోర్సులను రద్దు చేయడం దారుణం. – ఎస్‌.అక్బర్‌,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
1
1/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
2
2/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
3
3/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
4
4/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
5
5/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

కోర్సుల కోత.. కాలేజీల మూత! 
6
6/6

కోర్సుల కోత.. కాలేజీల మూత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement