
సమస్యలు పరిష్కరించండి సారూ..!
చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు క్యూ కట్టారు.
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
సదుం: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ..అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్న చంద్రబాబును ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బాబు షూరిటీ–మోసం గారెంటీలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన బాండ్ల హామీని బీజేపీ నాయకులు సైతం విశ్వసించ లేదన్నారు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని కరెంటు చార్జీలను పెంచడంతో పాటు, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బెల్టుషాపులు విస్తృతం చేశారని మండిపడ్డారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయలేదన్నారు. దీంతో ప్రజలకు చంద్రబాబుపై విశ్వాసం పోయిందన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేసింది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.
గ్రామకమిటీలే కీలకం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇవి భవిష్యత్తులో కీలకంగా మారనున్నట్టు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లోపు.. ఆ తర్వాత కూడా గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గ్రామాల్లోని ముఖ్యనాయకులకు కమిటీలలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
మీకు రుణపడి ఉంటా
గత 47 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అండగా ఉంటూ.. తన వెంట నడుస్తున్న మండల ప్రజానీకానికి రుణ పడి ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ కుటుంబ సభ్యులకు మెజారిటీ అందిస్తున్న మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. వారికి ఏకష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పుట్రాజు, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్పరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రెడిఈశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాబురెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఎన్నికల ముందు అలవిగాని హామీలు
అధికారంలోకి వచ్చాక పంగనామాలు
నేతల సంతకాలతో ఇచ్చిన బాండ్ల
సంతగేంటో?
బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం
‘ఎన్నికల ముందు కూటమి నేతలు అలవిగాని హామీలిచ్చారు. సూపర్–6 పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఉచిత బస్సు అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ రూ.5 వేలు అంటూ సంతకాలు పెట్టి మరీ బాండ్లు పంపిణీ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అటకెక్కించారు. ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఊర్లోకెళ్లినా ప్రజలు బాబును ఇక నమ్మే ప్రసక్తే లేదని అంటున్నారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సభల్లో పాల్గొని ప్రసంగించారు.

సమస్యలు పరిష్కరించండి సారూ..!

సమస్యలు పరిష్కరించండి సారూ..!