
ఆరు టిప్పర్ల సీజ్
పాలసముద్రం: గుట్టలోని గ్రావెల్ ఎర్రమట్టిని అక్రమంగా తమిళనాడుకి తీసుకెళ్తున్న ఆరు టిప్పర్లను స్థానిక తహసీల్దార్ అరుణకుమారి, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తమ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామమైన వనదుర్గాపురం పంచాయతీలోని గుట్టలో అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ మట్టిని తీసుకెళ్తున్నట్టు ఫిర్యాదు అందిందన్నారు. పరిశీలించగా.. అక్కడ గ్రావెల్ ఎర్రమట్టిని టిప్పర్‌లో తమిళనాడుకు తీసుకెళ్తున్నట్టు గుర్తించామన్నారు. అనంతరం ఎర్రమట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను సీజ్ చేసి పోలీస్టేషన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో డెప్యూటీ తహసీల్దార్ రిశివర్మ, ఆర్‌ఐ దేవి, వీఆర్‌ఓ వెంకటాచలం పాల్గొన్నారు.