సమస్యలు పరిష్కరించండి సారూ..! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి సారూ..!

Jul 15 2025 6:59 AM | Updated on Jul 15 2025 6:59 AM

సమస్య

సమస్యలు పరిష్కరించండి సారూ..!

● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన అర్జీదారులు ● వినతులు స్వీకరించిన కలెక్టర్‌ సుమిత్‌కు మార్‌గాంధీ, జేసీ విద్యాధరి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. శ్రీసమస్యలు పరిష్కరించండి సారూ..!శ్రీ అంటూ అధికారులను అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందిస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్‌ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

దూరంగా బదిలీ చేశారు

జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తమను ఇష్టానుసారంగా దూరంగా బదిలీ చేశారని ఏఎన్‌ఎంలు లక్ష్మి, చైతన్య, లీలా, సావిత్రి తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన బదిలీల్లో తమకు జరిగిన అన్యాయం పై కలెక్టర్‌ వద్దకు వెళ్లి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏఎన్‌ఎంల బదిలీ నిర్వహించారన్నారు. 200 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించగా.. ముందు తప్పుల తడకగా సీనియారిటీ జాబితాను ప్రచురించారన్నారు. ఖాళీల జాబితాను ప్రచురించకుండా బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించినట్టు పేర్కొన్నారు. 5 ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ అందులో ఒక్కటీ రాలేదన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆరు నెలలుగా నీటి సమస్య

గత ఆరు నెలలుగా నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టించుకోవడం లేదని పాలసముద్రం మండలం, కృష్ణజిమ్మాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట తలపై బిందెలు పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఆరు నెలలుగా నీటి కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో గ్రామస్తులు వెంకటమ్మ, రమణమ్మ, శాలిని, సుమలత పాల్గొన్నారు.

భూములు ఎన్ని సార్లు ఇవ్వాలి

ఇప్పటికే ఎన్‌హెచ్‌ 716 రోడ్డు ఏర్పాటుకు రెండు సార్లు తమ భూములను ఇచ్చామని, మరళా ఇంకెన్ని సార్లు భూములు ఇవ్వాలని నగరి మండలం, వీకేఆర్‌ పురం, తడుకుపేట గ్రామస్తులు రవిచంద్రన్‌, జ్యోతిప్రకాష్‌ వాపోయారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్‌హెచ్‌ 716 రోడ్డుకు భూములను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం తిరిగి టోల్‌గేట్‌, స్లిప్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. తడుకుపేట వద్ద ఉన్న ప్రభుత్వ భూములలో టోల్‌గేట్‌, స్లిప్‌ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

దారి సమస్య పరిష్కరించాలి

తమ పొలాలకు దారి సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని తవణంపల్లి మండలం, నల్లప్పరెడ్డిపల్లి గ్రామస్తులు రామచంద్ర, శిల్ప డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తాము వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమ పొలాలకు తరతరాలుగా ప్రభుత్వ భూమిలో ఉండే నీటి కాల్వ దారిలో వెళ్తున్నామన్నారు. ఆ దారిని కొందరు అడ్డుకుని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

సమస్యలు పరిష్కరించండి సారూ..!1
1/3

సమస్యలు పరిష్కరించండి సారూ..!

సమస్యలు పరిష్కరించండి సారూ..!2
2/3

సమస్యలు పరిష్కరించండి సారూ..!

సమస్యలు పరిష్కరించండి సారూ..!3
3/3

సమస్యలు పరిష్కరించండి సారూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement