
ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఊచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ–4 కార్యక్రమంలో పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గర్తించి రిజిస్టర్ చేయించాలన్నారు. ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, వార్డులో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.