ద్విచక్ర వాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం ఢీ

Jul 18 2025 5:18 AM | Updated on Jul 18 2025 5:18 AM

ద్విచ

ద్విచక్ర వాహనం ఢీ

– ఆర్టీసీ మెకానిక్‌ మృతి

రొంపిచెకర్ల: ద్విచక్ర వాహనం ఢీకుని ఆర్టీసీ మెకానిక్‌ మృతి చెందిన ఘటన రొంపిచెర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ, ఫజులుపేటలో బుధవారం రాత్రి జరిగింది. ఫజులుపేటకు చెందిన ఆర్టీసీ మెకానిక్‌ మోహన్‌బాబు పీలేరు ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నడు. రొంపిచెర్ల బస్టాండ్‌ నుంచి రాత్రి 10 గంటల సమయంలో రొంపిచెర్ల పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఇంటికి నడిచి వెళ్లుతుండగా నగిరి దళితవాడకు చెందిన నూతనకుమార్‌ (16) ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ మెకానిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాస్పత్రికి .. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరణించాడు. మృతుని కుమారుడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.

అటెండర్‌ ఆత్మహత్య

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని రెవెన్యూ డివిజనల్‌ ఆఫీస్‌ (ఆర్డిఓ)లో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్‌ (39) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇతన్ని ఇటీవల కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తించడం ఇష్టంలేని రవికుమార్‌ మనస్తాపంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రవికుమార్‌ మృతిచెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. టూ టౌన్‌ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

చంద్రగిరి: హాస్టల్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వార్డెన్‌ వనజ కథనం మేరకు.. పట్టణంలోని ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో తిరుపతికి చెందిన శ్యామ్‌ నాగరాజు, పీలేరుకు చెందిన గోపిచంద్‌ స్థానిక ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బుధవారం మధ్యాహ్నం గోపిచంద్‌ స్కూల్‌కు వెళ్లకుండా బయట తిరుగుతుండగా వార్డెన్‌ వనజ కంటపడ్డాడు. దీంతో స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని ఆమె విద్యార్థినిని ప్రశ్నించారు. క్రమం తప్పకుండా స్కూల్‌కు వెళ్లాలని, ఇలా బయటకు రాకూడదని మందలించారు. ఆపై శ్యామ్‌ నాగరాజ్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. చంద్రగిరికి చేరుకున్న శ్యామ్‌ నాగరాజ్‌ కుటుంబ సభ్యులు విద్యార్థిని తీవ్రంగా మందలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాచ్‌మెన్‌ విద్యార్థుల గదులను పరిశీలిస్తుండగా శ్యామ్‌ నాగరాజ్‌తోపాటు గోపిచంద్‌ కనిపించకుండా పోయినట్లు గుర్తించి, వార్డెన్‌కు సమాచారం అందించారు. హాస్టల్‌కు చేరుకున్న వార్డెన్‌ విద్యార్థులు కనిపించపోవడంతో వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. శ్రీనివాసమంగాపురం, శ్రీవారిమెట్టు, నరసింగాపురం రైల్వే స్టేషన్‌ పరిసరాలను ఆచూకీ కోసం వెతికారు. విద్యార్థులు ఆచూకీ లభించకపోవడంతో వార్డెన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వార్డెన్‌ వనజ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు.

ద్విచక్ర వాహనం ఢీ 
1
1/1

ద్విచక్ర వాహనం ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement