
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
రేణిగుంట: సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పి శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు జయచంద్ర, మంజునాథరెడ్డి, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.