
మొగిలి దేవరకొండలో చిరుత
బంగారుపాళెం: మండలంలోని మొగిలి దేవరకొండలో చిరుతలు సంచరిస్తున్నాయి. శుక్రవారం తమిళనాడుకు చెందిన భక్తులు కారులో పార్వతీ సమేత శ్రీజలకంఠేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు దేవరకొండకు వెళ్తుండగా గోశాల సమీపంలో ఓ చిరుత రోడ్డు పకన కనిపించినట్లు తెలిపారు. దేవరకొండ చుట్టూ కౌండిన్య అభయారణ్యం ఆవరించి ఉండడం వల్ల చిరుతలు, ఏనుగులు సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు, గ్రామస్తులు తెలిపారు. గతంలో దేవరకొండ సమీపంలో చిరుతలు మేకలు, పశువులపై దాడి చేసి చంపేసినట్లు పేర్కొన్నారు. చిరుతల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సారా కేసుల్లో
తొమ్మిది మంది బైండోవర్
కుప్పం: మండల పరిధిలోని దేవరాజుపురం, ఆరిమానుపెంట గ్రామాల్లో గతంలో సారాయి కేసుల్లో నిందితులుగా ఉన్నా తొమ్మిది మందిని బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ నాగరాజు తెలిపారు. తమిళనాడు సరిహద్దులోని తిమ్మంబట్టు, వాణియంబడి పోలీసు స్టేషన్లలో వీరిపై సారాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. దేవరాజుపురం గ్రామానికి చెందిన ఏలుమలై, తంగం, ముత్తు, రామలింగం, అమ్ములు, తిరుమలై, మోహన్, కార్తీక్, చిరంజీవిని కుప్పం తహసీల్దార్ చిట్టిబాబు సమక్షంలో హాజరు పరిచినట్టు వెల్లడించారు. ఆపై రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బైండోవర్ చేసినట్టు తెలిపారు.
ఒంటరి ఏనుగు బీభత్సం
తవణంపల్లె: ఒంటరి ఏనుగు పొలాల్లో బీభత్సం సృష్టించింది. మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మాధవరం సమీపంలోని అడవిలో నుంచి వచ్చి రచ్చరచ్చ చేసింది. గుంపులో నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు చాలా కాలంగా సంచరిస్తోంది. ఈ ఏనుగు గురువారం రాత్రి మాధవరానికి చెందిన మనోహర్‌రెడ్డి మామిడి తోటలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించింది. భారీగా మామిడి కొమ్మలు విరిచివేసింది. కొమ్మల్లో సుమారు అర టన్నుకు పైగా నీలం రకం కాయలను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో సుమారు రూ.20 వేల వరకు నష్టపోయినట్టు బాధిత రైతు వాపోయాడు.

మొగిలి దేవరకొండలో చిరుత

మొగిలి దేవరకొండలో చిరుత